Monday, February 24, 2025
HomeTrending Newsసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎడమ కాలువకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ రోజు ఉదయం నీటిని విడుదల చేశారు. దశాబ్దకాలం తరువాత జులై లో నీటి విడుదల చేయటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  శాసనసభ్యులు నోముల భగత్,శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి,జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జలాల వాటాలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న సర్కార్…ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు అందిస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

ఎడమ కాలువకు జులైలో నీరు విడుదల చేయడం రెండు దశాబ్దాల రెండు సంవత్సరాలలో ఇది ఐదోసారి. తెలంగాణ ఆవిర్భావం తరువాత జులైలో విడుదల చేయడం ఇదే ప్రధమం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు
6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు.

ఎడమ కాలువ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట,ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలలో భూములు సాగు అవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో1.45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో(ఎత్తిపోతల తో కలుపుకుని2,41,000 వేల ఎకరాలు ఉన్నాయి. టి.యం.సి ల వారిగా నల్లగొండ జిల్లాకు 18 టి.యం.సి లు సూర్యాపేట జిల్లాకు 18 టి యం సి లు ఖమ్మం జిల్లాకు 29 టి యం సి లు కేటాయింపులు ఉన్నాయి.

Also Readనాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద 

RELATED ARTICLES

Most Popular

న్యూస్