Saturday, November 23, 2024
HomeTrending Newsసిఎం కృషి వల్లే ఇది సాధ్యం: గుడివాడ

సిఎం కృషి వల్లే ఇది సాధ్యం: గుడివాడ

సిఎం జగన్ పారిశ్రామిక రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్ర ప్రదేశ్ మరోసారి సత్తా చాటిందని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. నేడు కేంద్రం ప్రకటించిన బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020లో ఏపీ టాప్‌ అచీవర్స్‌ లో మొదటి స్థానంలో నిలిచిందని, జగన్‌ నేతృత్వంలో ఇది సాధించినందుకు సంతోషిస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని సర్క్యూట్‌ హౌజ్‌లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి కోసం చాలా చిత్తశుద్థితో జగన్ కృషి చేశారని,కోవిడ్‌ వల్ల రెండేళ్లు పూర్తిగా నష్టపోయినా, మనం ఈ రంగంలో మంచి పురోగతి సాధించామని, రాష్ట్రంలో వనరులను సద్వినియోగం చేసుకునే దిశలో ప్రభుత్వం చూపిన చొరవ, పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందించడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు.

పరిశ్రమలకు ఏ అవసరం ఉన్నా వెంటనే స్పందిస్తామని, పారిశ్రామికవేత్తలకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని సిఎం ఎప్పుడూ చెబుతున్నారని గుర్తు చేశారు.  గత కొన్నేళ్లుగా ర్యాంక్‌లు ఇస్తున్నారని ఇప్పుడు టాప్‌ అచీవర్స్‌ అని ఇచ్చారని, 7 రాష్ట్రాలను టాప్‌ అచీవర్స్‌గా ప్రకటించగా అందులో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్‌ది కావడం గర్వంగా ఉందన్నారు.

డీకార్బనైజ్డ్‌ ఎకానమీకి సంబంధించి దావోస్‌లో దాదాపు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నామని, అందులో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇటీవలి క్యాబినెట్‌ భేటీలో క్లియరెన్స్‌ ఇచ్చామని గుడివాడ  చెప్పారు. రాష్ట్రంలో 30 చోట్ల 32 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు మొదలు పెట్టామని, ప్రభుత్వ చిత్తశుద్దితో వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వేగంగా పురోగమిస్తోందని వివరించారు.

Also Read : ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ ఏపీ టాప్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్