Saturday, November 23, 2024
HomeTrending NewsBJP-AP: మత్స్యకారులపై నిర్లక్ష్యం: పురంధేశ్వరి

BJP-AP: మత్స్యకారులపై నిర్లక్ష్యం: పురంధేశ్వరి

అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. అందుకే ఈ ప్రాంత అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.   రాష్ట్రానికి సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, కానీ మత్స్యకారుల సంక్షేమం కోసం ఏం చేసిందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని, సబ్సిడీ మరబోట్లు, వలలు ఎంతమందికి  ఇచ్చారో  చెప్పాలని డిమాండ్ చేశారు.  బిజెపి కోస్తా జిల్లాల జోనల్ సమావేశం గుంటూరులో జరిగింది. ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రతిసారీ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ మాట్లాడతారని.. కానీ చీరాలలో కిరణ్, బాపట్లలో అమర్నాథ్ గౌడ్ సంఘటనలకు ఏం సమాధానం చెబుతారని అడిగారు.  తాడేపల్లి సిఎం నివాసానికి కూతవేటు దూరంలో దళిత మహిళపై అమానుషం జరిగితే న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు.

చిత్తూరు జిల్లా ఏర్పేడులో నేషనల్ ఇండస్ట్రియల్  మ్యానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటుకు కేంద్రం నిర్ణయిస్తే అక్కడ గుప్పెడు మట్టి కూడా వేయలేదని, కానీ రాష్ట్రంలో పాటు రాజస్థాన్ కు ఇచ్చి నిమ్జ్ జ్ లో  65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి  3 లక్షల మంది యువతకు ఉపాధి దొరికిందని వివరించారు.

 విశాఖ, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తిల్లో ఇండస్ట్రియల్ నోడ్స్ ఇచ్చారని కానీ అక్కడ ఒక్క పరిశ్రమ కూడా తెలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో అక్రమ  ఇసుక మైనింగ్ జరుగుతోందని, సర్వేపల్లిలో మంత్రి కాకాణి అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నారని ఆరోపించారు.

వెలిగొండ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారని, పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి వరాప్రదాయిని అయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు  గేటు విరిగిపోతే కనీసం మూడు కోట్ల రూపాయలతో మరమ్మతులు కూడా చేయించలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ఈ ప్రాంతానికి సాగు, తాగు నీరు రాకపోయినా సరస్వతి ప్రాజెక్టుకు మాత్రం 2.19క్యూసెక్కుల నీరు కేవలం 5.50 రూపాయలకే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.  పురంధేశ్వరి వెంట మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్