Sunday, November 24, 2024
HomeTrending NewsYS Jagan: మహిళా వివక్షపై రాజీలేని పోరాటం

YS Jagan: మహిళా వివక్షపై రాజీలేని పోరాటం

21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపనపడుతున్నానని అందుకే  మహిళల ఆర్ధిక, రాజకీయ స్వావలంబనకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  ఏలూరు జిల్లా దెందులూరులో వైయస్సార్‌ ఆసరా కార్యక్రమం మూడో విడత నిధులను మహిళా స్వయం సహాయక సభ్యుల అకౌంట్లలో జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్  ప్రసంగించారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని,  ‘ఈ 45 నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసింది’ అని చెప్పారు.

సిఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • రూ.6,419.89 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతాయి
  • ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదు
  • ఈ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ మీ అభిమతానికే విడిపెట్టాను
  • స్వయం ఉపాధి పొందాలనుకుంటే.. ప్రభుత్వం పరంగా అండదండలు
  • అక్షరాల రూ.19,178 కోట్లు ఒక్క ఆసరా కార్యక్రమం కింద ఇచ్చాం
  • మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ.. అన్నగా… ప్రభుత్వం నిలబడుతుంది
  • ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం
  • 9 లక్షల మందికిపైగా నా అక్క చెల్లెమ్మలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు
  • రూ.4,355 కోట్లు బ్యాంకుల ద్వారా వారికి అనుసంధానం చేశాం
  • తద్వారా వారి కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారు
  • 2014-19 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించి… సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14వేల కోట్లు కాగా, ఇవాళ బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతున్నాయి
  • 55 శాతం రుణాలను పొదుపు సంఘాలు తిరిగి చెల్లిస్తున్నారు
  • దేశానికి రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయి
  • బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం
  • ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నాం

  • ఎన్‌పీఏలు, ఓవర్‌ డ్యూలు కేవలం 45శాతం మాత్రమే
  • గత ప్రభుత్వం హయాంలో 36శాతం
  • చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం.. మళ్లీ ఊపిరి పోసుకుంది
  • రుణాలు మాఫీచేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ ఇచ్చి తర్వాత వా రిని నిలువునా ముంచేశారు
  • 2016 అక్టోబరు నుంచి కూడా సున్నా వడ్డీరుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారు
  • రూ.3వేల కోట్ల వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి, తిరిగి సున్నావడ్డీ కిందరుణాలు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చాం
  • 2016 అక్టోబరులో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3600 కోట్లు చెల్లించాం
  • చిక్కటి చిరునవ్వుతోనే ఇదంతా చేశాం
  • అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం
  • ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వమిది
  • గుడి ఛైర్మన్‌, ఏంఎసీ.. ఇలా నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం
  • అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్‌ను తీసుకు వచ్చాం
  • 17 లక్షల మంది రిజస్టర్‌ చేసుకున్నారు
  • మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వం
  • కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది

అంటూ జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్