AP-Women Empowerment:
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. బద్వేల్ నియోజకవర్గం నుంచి ఇటీవలే ఎన్నికైన డా. సుధ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకరించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం వ్యక్తం చేసింది. తరువాత టీ విరామం ప్రకటించి, బిఏసీ సమావేశం నిర్వహించారు. ఈనెల 26 వరకూ సభ నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది.
సభ తిరిగి సమావేశం కాగానే ‘మహిళా సాధికారత’ పై సభలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తావేటి వనిత ప్రకటన చేశారు. రెండున్నరేళ్ళుగా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వనిత ప్రస్తావించారు
లబ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ శాచురేషన్ పద్ధతిలో సంక్షేమం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. రెండేళ్లలో వివిధ సంక్షేమ పథకాలకు రెండేళ్లలో అందించిన సాయం(కోట్ల రూపాయల్లో), లబ్ధిదారుల వివరాలను మంత్రి సభ ద్వారా తెలియజేశారు.
జగనన్న అమ్మ ఒడి:
44.05 లక్షల తల్లుల ఖాతాల్లో 13, 022 కోట్లు
మహిళా సంఘాల రుణాలు:
12,758 కోట్లు రుణ మాఫీ (రెండు విడతల్లో)
వైఎస్సార్ చేయూత:
24.55 లక్షల మంది, 8,943.53 కోట్లు
వైఎస్సార్ కాపునేస్తం:
3,27,862 మంది, 981.88 కోట్లు
జగనన్న వసతి దీవెన:
15,56,956 తల్లుల ఖాతాల్లో 2,269.93 కోట్లు
జగనన్న విద్యా దీవెన:
18,80,934 తల్లుల ఖాతాల్లో 5,573.12 కోట్లు (పాత బాకీలతో కలిపి)
వైఎస్సార్ పెన్షన్ కానుక:
36.7 మహిళా లబ్దిదారులు, 21,899 కోట్లు
మహిళలకు సున్నావడ్డీ రుణాలు:
90 లక్షల మందికి 2,354.22 కోట్లు
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు:
30.22,834 లబ్దిదారులు 27 వేల కోట్లు…
వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలపై ఏటా 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వీటితో పాటు అమూల్ పాల వెల్లువ, బల్క్ మిల్క్ సెంటర్లు, నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం లాంటి అంశాలను కూడా మంత్రి అనిత సభలో వివరించారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, విడదల రజని, విశ్వాసరాయ కళావతి, డా. శ్రీదేవి, కంగాటి శ్రీదేవి, రెడ్డి శాంతి, జొన్నలగడ్డ పద్మావతి, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడారు. అనంతరం సిఎం జగన్ ప్రసంగించారు.
Also Read : జగన్ పాలనలో మహిళాభ్యుదయం: వాసిరెడ్డి