Parashuram confidence: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు పరశురామ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా… అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం నిర్మించారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులు కేరింతల మధ్య హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సహా చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు.. అతిధులుగా పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆద్యంతం అలరించించింది.
దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ “నేను తయారు చేసుకున్న ‘సర్కారు వారి పాట’ కథని మహేష్ బాబు గారి దగ్గరకి తీసుకెళ్లడానికి దర్శకుడు కొరటాల శివ గారు హెల్ప్ చేశారు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెబుతున్నాను. మహేష్ బాబు గారికి మొదట కథ చెప్పినపుడు భయం వేసింది. ఐదు నిమిషాల నేరేషన్ తర్వాత మహేష్ గారి ముఖంపై ఒక నవ్వు కనిపించింది. ఆ నవ్వే ఇక్కడివరకూ తీసుకొచ్చింది. నన్ను ఇంత నమ్మిన మహేష్ గారికి లైఫ్ లాంగ్ థ్యాంక్స్ చెప్పినా సరిపోదు”
“నా విజన్ తెరపై చూపించడానికి ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు, డీవోపి మధి, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ , తమన్ , రామ్‌లక్ష్మణ్, ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారు అనంత శ్రీరామ్ .. యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు. కో డైరెక్టర్ ప్రసాద్ గారు, సీతారాం, అశోక్, స్వప్నిక , అరవింద్, నాగార్జున , రవి , గాంధీ శ్రీనివాస్.. ఇలా డైరెక్టర్ టీంలో అందరూ చాలా కష్టపడి చేశారు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా అదిరిపోతుంది. మే 12 బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం” అన్నారు.