Sunday, March 8, 2026
HomeTrending Newsఒక్క సంస్థ కూడా మూయడంలేదు: సురేష్

ఒక్క సంస్థ కూడా మూయడంలేదు: సురేష్

రాష్ట్రంలో ఒక్క విద్యాసంస్థను కూడా మూసివేయడంలేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ గ్రాంట్ తో పనిచేస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్థలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం పలు పథకాలు అందిస్తున్నా, ఎయిడెడ్ స్కూళ్ళల్లో విద్యార్ధుల ప్రవేశాలు పెరగలేదని గమనించినట్లు మంత్రి వివరించారు. ఈ అంశాలపై రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో ఏప్రిల్ నెలలో కమిటిని ఏర్పాటు చేశామని, ఈ కమిటి నివేదిక కూడా ఇచ్చిందని మంత్రి తెలిపారు.

⦿ గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ ను వదులుకుని ప్రైవేట్ విద్యా సంస్థలుగా నడపటం
⦿ వారి ఆస్థిపాస్థులు ఉంటే ప్రభుత్వానికి ఇచ్చి పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మార్చటానికి ఆప్షన్ ఇచ్చాం
⦿ సమర్ధవంతంగా నడుపుతామనే ఆప్షన్ ఇస్తే పర్యవేక్షణ

అనే మూడు ఆప్షన్స్ ఇస్తూ జీవో నంబర్ 42, 50, 51 లు ఇచ్చామని తెలియజేశారు

రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు వందలకు పైగా ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉన్నాయని,  వీటిలో 1200 పాఠశాలలు ఎయిడ్ వదులుకోవటానికి అంగీకరించారని మంత్రి ప్రకటించారు. 5 నుంచి 6 వేల మంది ఉపాధ్యాయులు వీటిలో పని చేస్తున్నారని పేర్కొన్నారు.  డిగ్రీ కాలేజీల్లో 93 శాతం, జూనియర్ కాలేజీల్లో 89 శాతం యాజమాన్యాలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ను వదులుకోవటానికి ముందుకు వచ్చారని మంత్రి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular