Tuesday, January 21, 2025
HomeTrending Newsఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేం: సజ్జల

ఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేం: సజ్జల

నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వీటిలో మహిళలకు 50 శాతం దక్కేలా చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ లను తమ సహజమైన కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ అని,  తమ డిఎన్ఏ లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం ఉందన్నారు. బలహీన వర్గాల సంక్షేమంలో సిఎం జగన్ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారని అన్నారు. పాలనలో ఒక రోల్ మోడల్ లా నిలిచారని ప్రశంసించారు.  విజయవాడ సమీపంలోని తాడేపల్లి సి.యస్.ఆర్. ఫంక్షన్ హాల్ లో  ఎస్.సి- ఎస్.టి గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సిఎం పీడిక రాజన్న దొర,  మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బాపట్ల ఎంపీ సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు, పలువురు గెజిటెడ్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ… ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బలహీన వర్గాలకు విద్య, వైద్యం చేరువ చేశామన్నారు. సిఎం జగన్ దావోస్ వెళ్ళలేదంటూ టిడిపి చేస్తున్న ప్రచారం నవ్వు తెప్పించిందన్నారు. బాబు తొమ్మిదేళ్ళు  అక్కడకు వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలన్నారు.

గతంలో ఉద్యోగ సంఘాల నేతలను రాజకీయ ప్రజోయనాలకు వాడుకునేవారని,  కానీ తాము వారిని ప్రభుత్వంలో ఓ భాగంగా చూస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేమని, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేందుకు వారు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని,  తాను ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని సజ్జల హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్