Wednesday, March 18, 2026
HomeTrending NewsAmbati Rambabu: గెలిచే పరిస్థితి లేకపోతే నాకూ ఇవ్వరు

Ambati Rambabu: గెలిచే పరిస్థితి లేకపోతే నాకూ ఇవ్వరు

గెలిచే అవకాశం లేకపోతే టిక్కెట్లు ఇవ్వనని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడో స్పష్టంగా చెప్పారని, తాను గెలవలేనని అనుకుంటే సత్తెనపల్లిలో తనకు కూడా టికెట్ ఇవ్వరని రాష్ట్ర జలవనలశాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో అసమ్మతి విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్ ఛార్జ్ లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశమవుతున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు వచ్చిన అంబటి మీడియాతో మాట్లాడారు.

మంత్రివర్గంలో మార్పులు కేవలం ప్రచారం మాత్రమేనని అంబటి అభిప్రాయపడ్డారు. ఈనెల ఏడు నుంచి జగనన్న మా భవిష్యత్ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, అసలు ఆ అవసరం కూడా జగన్ కు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని మంత్రి రాంబాబు తేల్చి చెప్పారు.

Also Read : ఏప్రిల్ 5న ఒంటిమిట్టకు సిఎం జగన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular