Saturday, January 18, 2025
HomeTrending Newsభక్తులకు మరికొన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాదం

భక్తులకు మరికొన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాదం

Anna Prasadam: తిరుమల కొండపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాద భవనంతో పాటు మరిన్ని ప్రాంతాలలో అన్న ప్రసాద కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్లు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వీటికి అదనంగా తిరుమలలో మరో రెండు చోట్ల అన్న ప్రసాద భవనాలు కూడా తాత్కాలికంగా  ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.  తిరుమలలో క్యూ లైన్ల లోని భక్తులకు పాలు, తాగునీరు, ఆహారమందిస్తున్నామని తెలిపారు.  ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సుబ్బారెడ్డి  పేర్కొన్నారు.

తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర గో సంర‌క్షణ‌శాల‌లో దేశీయ ఆవు పాలతో నెయ్యి తయారీ కేంద్రం నిర్మాణానికి  టిటిడి ఈవో డా. కే. జవహర్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సుబ్బారెడ్డి నేడు శంఖుస్థాపన చేశారు.

Also Read : తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు  రద్దు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్