Friday, November 22, 2024
HomeTrending Newsమంచి చేశాం - మళ్ళీ అధికారం మాదే : సిఎం జగన్

మంచి చేశాం – మళ్ళీ అధికారం మాదే : సిఎం జగన్

విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నానని చెప్పారు. తిరుపతిలో జరిగిన ఇండియా టుడే సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

* వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం
* మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చాం
* మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది
* కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతుంది, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు
* రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు, అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు
* ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవు
* ఇదే బడ్జెట్‌ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది. కాని అప్పుడు డీబీటీ ఎందుకు జరగలేదు
* మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు
* చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదు
* సీఐడీని దుర్వినియోగం ఆరోపణలు అర్థరహితం
* చంద్రబాబుపై ఆరోపణలు, వాటిపై ఆధారాలు పరిశీలించాకే కోర్టులు నిర్ణయం తీసుకున్నాయి
* పేదరికాన్ని నిర్మూలించాలంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను
* విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరి హక్కుకావాలి
* పేదరికాన్ని నిర్మూలించాలంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను
* విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరి హక్కుకావాలి
* పేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు
* పేద పిల్లలు కేవలం తెలుగుమీడియంకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు ఇంగ్లిషు మీడియం చదువుతున్నారు
* సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకూ అందాలి
* మా రాష్ట్రంలో పేదపిల్లలకు సంపన్నుల పిల్లలకు అందే చదువులు అందాలన్నదే మా లక్ష్యం
* కేవలం మేం స్కూలు విద్యపైనే కాదు, ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టిపెట్టాం
* నేను ఏమీ హామీ ఇచ్చాను, నేనే ఏం చేశాను అన్నది చూడాలి
* మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.5 శాతం అమలు చేశాను
* అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను
* ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత
* ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం
* వివక్ష లేకండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం
* డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం
* అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో డీబీటీ అమలు చేశాం
* కచ్చితం మేం తిరిగి అధికారంలోకి వస్తాం
* ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవు
* ఇదే బడ్జెట్‌ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది
* కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు
* కాని ఈప్రభుత్వం మాత్రమే చేయగలిగింది
* రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ఉనికి పెద్దగా ఉండదు. పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన మధ్యే ఉంటుంది
* ప్రతిపార్టీకూడా సర్వేలు చేస్తుంది, వాటి ఫలితాలు ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది
* ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు:
* కాని కొందరు స్థానిక నాయకులు విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు
* అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం
* చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం
* జాతీయ రాజకీయాలు విషయంలో మావిధానం స్పష్టం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడం
* ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో ముందుకు వెళ్తున్నాం
* కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతుంది, అది ఆపార్టీ సంప్రదాయంగా చూస్తున్నాం
* రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు
* అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు:
* నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు, వారు పాఠాలు నేర్వేలేదు.
* వారి పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు. కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది
* దేవుడ్ని నేను బలంగా నమ్మతాను. ఆయనే అన్నీ చూస్తాడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్