Wednesday, June 26, 2024
HomeTrending Newsషర్మిలతో మాకేం ఇబ్బంది లేదు : కొడాలి నాని

షర్మిలతో మాకేం ఇబ్బంది లేదు : కొడాలి నాని

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంవల్ల తమ పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేదని అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలికి వదిలేయడం, ఉమ్మడి రాష్ట్రంలో చనిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించిన వైఎస్సార్ ను ఆయన చనిపోయిన తరువాత కేసుల్లో ముద్దాయిగా చేర్చి, ఆయన తనయుడు జగన్ ను జైల్లో పెట్టిందని ఈ రెండు కారణాల వల్లే ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయ్యిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ దీనికి క్షమాపణలు చెబితేనే రాష్ట్రంలో నాలుగు ఓట్లు పడే అవకాశం ఉందన్నారు.

కాంగ్రెస్ లో షర్మిల చేరిక వెనుక చంద్రబాబు హస్తం ఉండ వచ్చనే అనుమానాన్ని కొడాలి వ్యక్తం చేశారు. కుటుంబాల్లో చిచ్చుపెట్టే సంస్కృతి చంద్రబాబుకే ఉందని, ఎన్టీఆర్ కు- ఆయన కుటుంబానికి కూడా గొడవలు పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.

ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి జాతీయ పార్టీ బిజెపికి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారని, అంతమాత్రాన టిడిపి ఓటు బ్యాంకు బిజెపికి రాలేదని నాని విశ్లేషించారు. ఎన్నికల సమయంలో అనేక అంశాలు ప్రభావితం చేస్చేతాయని, ప్రజలు తమ ఆర్ధిక పరిస్థితులు, ప్రభుత్వం చేస్తున్న మంచి చూసి ఓట్లు వేస్తారు తప్ప కాంగ్రెస్ లో ఎవరో చేరినంత మాత్రాన ఆ ప్రభావం తమపై ఉండబోదని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్