Friday, November 22, 2024
HomeTrending Newsజగన్ పాలనలో వివక్షకు తావులేదు: నారాయణ స్వామి

జగన్ పాలనలో వివక్షకు తావులేదు: నారాయణ స్వామి

గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని సామాజిక సాధికారతను సిఎం జగన్ మనకు అందించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి కొనియాడారు. పేదలందరూ బాగుండాలని, వారి తలరాతలు మారాలని, వారి పిల్లలు పెద్ద చదువులు చదవాలని జగనన్న తపిస్తారని అన్నారు. పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఇంటి గడప దగ్గరే వాటిని అందిస్తున్నారని తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో జరిగిన సామాజిక బస్సు యాత్ర విజయవంతమైంది నాలుగు మండలాలనుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీసీఎం నారాయణస్వామి, ఎంపీలు గోరంట్లమాధవ్, గురుమూర్తి, సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యే సుధాకర్‌లు ప్రసంగించారు.

ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ మాట ఇస్తే తప్పని జగనన్న పేదల పాలిట పెన్నిధి అని,  పేదలందరికీ రూ.25లక్షల వరకు ఉచితవైద్యం అందించేలా ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారని వివరించారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేసే చంద్రబాబు ఎక్కడ? ప్రజలను నమ్ముకుని..వారి మంచికోసం పాలన చేస్తున్న జగనన్న ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. జగన్‌ పాలనలో వివక్షకు చోటు లేదని, బాబు పాలనలో అడుగడుగునా వివక్షే ఎదురైందని చెప్పారు. పేదరికం సమసిపోయే వరకు పోరాటం చేస్తానంటున్న జగనన్నకు తోడుగా నిలవాలని పిలుపు ఇచ్చారు.

విండ్‌పవర్‌, సోలార్‌ పవర్‌లకు సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాటుతో పాణ్యం నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు పడ్డాయని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఓర్వగల్లు ప్రాజెక్టులను నిలబెట్టామని, అవుకు రిజర్వాయర్‌కు కూడా నీళ్లిచ్చే స్థాయికి వచ్చామని వివరించారు. పేదప్రజలకు మేలు చేయాలన్న తపన ఉన్న మహానేత వైయస్సార్‌ అని, ఆ తపన ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిలో కనిపిస్తోందని ప్రశంసించారు.  ఇచ్చిన మాటపై నిలబడటం జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వంమని, ఆయన్ను నమ్మితే మనకు మంచి జరుగుతుందని ప్రజలకు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్