Friday, March 28, 2025
HomeTrending Newsటిడిపి నేతల వల్లే రాధాకు హాని: వెల్లంపల్లి

టిడిపి నేతల వల్లే రాధాకు హాని: వెల్లంపల్లి

Vangaveeti Radha Issue: వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ నేతల నుంచే హాని ఉండొచ్చని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వంగవీటి రంగాకు భద్రత కల్పించకుండా అవమానించిందని గుర్తు చేశారు.

రాధాకు ప్రాణహాని ఉందన్న అనుమానం రాగానే తమ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించిందని, రాధా అడగకపోయినా సిఎం జగన్ ఆయనకు భద్రత కల్పించాలని ఆదేశించారని వెల్లంపల్లి వెల్లడించారు. చంద్రబాబు ఎక్కడో ఉండి లేఖలు రాయడం సిగ్గుచేటన్నారు.

కాగా, రాధా కార్యాలయం ముందు ఓ స్కూటీ కొంతకాలంగా పార్క్ చేసి ఉన్నట్లు గుర్తించారు. కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సాయంత్రం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయవాడ చేరుకోనున్నారు. రేపు ఉదయం వంగవీటి రాధా చంద్రబాబుతో సమావేశం కానున్నట్లు తెలిసింది.

Also Read : రాధా బాధ్యత ప్రభుత్వానిదే : బాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్