Monday, November 25, 2024
HomeTrending Newsరాష్ట్రానికి జరిగిన కీడు ఎక్కువ బాధించింది: బాబు

రాష్ట్రానికి జరిగిన కీడు ఎక్కువ బాధించింది: బాబు

వైసీపీ మూక వ్యక్తిగతంగా తన కుటుంబంపై చేసిన దాడి కంటే జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహం తనను ఎంతో బాధపెడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వీరి చర్యల వాళ్ళ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని, తనపై అవినీతి ముద్ర వేసి వేధిస్తున్నా దానికంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ మయం చేసి యువతను నాశనం చేశారని, ఇది తనను ఎక్కువ కలచివేసిందన్నారు. ఏలూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచార సభలో బాబు పాల్గొని ప్రసంగించారు.  తాము అధికారంలోకి రాగానే గంజాయి బ్యాచ్ మీద ఉక్కుపాదం మోపుతామని, మీ బిడ్డలను కాపాడతానని వెల్లడించారు.  జగన్ ను అధికారంలోకి దించడంతో పాటు ఓ మంచి ప్రత్యామ్నాయంతో వస్తున్నామని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి.. పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతామని హామీ ఇచ్చారు.

ముస్లిం రిజర్వేషన్ కాపాడతానని, వాటిని తొలగించే ప్రసక్తే లేదని, దీనికోసం కోర్టులో పోరాడతామని, వారి హక్కుల కోసం అండగా ఉంటామని బాబు హామీ ఇచ్చారు. మైనార్టీల కోసం షాదీఖానా, మసీదులకు ఆర్ధిక సాయం చేసిన, ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తమదేనని… ఎవరైనా మక్కాకు వెళ్ళాలనుకుంటే వారికి లక్ష రూపాయలు ఇస్తామని, రూ.5 లక్షల వరకూ వడ్డీ లేని రుణాలు ఇస్తామని వివరించారు.

ఎన్నార్సీ, సీఏఏ అంశాల్లో కేంద్రంలో బిల్ పాస్ కావడంలో వైసీపీ సహకరించిందని, ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో గలీజు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పేదే చేస్తానని, చేసేది పారదర్శకంగా చేస్తానని స్పష్టం చేశారు.  జగన్ చేసేది చీకటి రాజకీయాలైతే తాను చేసేది వెలుగు తెచ్చే రాజకీయాలని చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్