Saturday, January 18, 2025
HomeTrending Newsకీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు: సిఎం

కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు: సిఎం

Flagship Sectors: విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకమైనవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం లాంటి రంగాల్లోని వ్యవస్థలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్‌ సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను అయన పరిశీలించారు. ‘ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఇలా’ అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

సమీక్ష సందర్భంగా సిఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు…

⦿ ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం
⦿ వాటిద్వారా ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టా:
⦿ వైద్య రంగం విషయానికొస్తే.. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వేల సంఖ్యలో పోస్టులను భర్తీచేశాం
⦿ వేల కోట్లను ఈ రంగంపై ఖర్చు చేస్తున్నాం
⦿ విలేజ్‌ / వార్డు క్లినిక్స్‌ దగ్గరనుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ కూడా నాడు – నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నాం


⦿ ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్‌ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం
⦿ ఆరోగ్య ఆసరా కింద రోగులకు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటి వెళ్లే సమయంలో డబ్బులు ఇస్తున్నాం
⦿ ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచాం
⦿ 16 టీచింగ్‌ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం
⦿ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నాం
⦿ భారీ మార్పులను ఆశించి, దానికి అనుగుణంగా లక్ష్యాలు పెట్టుకున్నాం
⦿ అందుకే విద్య, వైద్య సహా కీలక రంగాలను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నాం
⦿ అనుభవం, సమర్థత ఉన్న అధికారులను ఆయా శాఖలకు అప్పగించాం
⦿ ఒక ముఖ్యమంత్రిగా నేను లక్ష్యాలను నిర్దేశిస్తాను
⦿ కాని, ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పనిచేయాలి
⦿ శాఖాధిపతులు, వారి కింద పనిచేస్తున్న సిబ్బంది ఛాలెంజ్‌గా స్వీకరించాలి
⦿ ఆశించిన మార్పుల సాధనకు, లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులుతో పాటు, సిబ్బంది అంతే సీరియస్‌గా పనిచేయాలి

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సీఎం ఆరా
⦿ మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలి, ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలి
⦿ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నాం
⦿ వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదు
⦿ ప్రజలకు తప్పకుండా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేందుకు గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆమేరకు  వారికి జీతాలు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం
⦿ అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించాం

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సీఎం ఆరా తీశారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు, విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్‌ నిర్మాణం, కొత్త పీహెచ్‌సీలు, మెడికల్‌కాలేజీల నిర్మాణంపై సీఎం సమీక్షించారు.

ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి: కొలువు తీరిన కొత్త మంత్రివర్గం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్