We only: రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొని ఉందని, పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకు రావడానికి శ్రేణులు కృషి చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని, కుటుంబ పార్టీల అవినీతి కారణంగానే ప్రాజెక్టు ఆలస్యమవుతోందని, బిజెపి అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజన్ గ్రోత్ తో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ పరిపాలన, సంక్షేమం అంతా అవినీతిమయమని విమర్శించారు . రాజమండ్రిలో జరిగిన భారతీయ జనతా పార్టీ గోదావరి జోనల్ సమావేశంలో కేంద్రమంత్రి అబ్బయ్యనారాయణ స్వామి, రాష్ట్ర సహ ఇంచార్జి సునీల్ దేవదర్ లతో కలిసి సోము పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాజధానిపై వైసీపీ, తెలుగుదేశం పార్టీల ద్వంద వైఖరిని తప్పుబట్టారు. రాజధానిని వివాదం చేసిన పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని గుర్తు చేశారు. రాజధాని అభివృద్ధి కోసం 7200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, చివరకు రాజధాని కనపడక పోవడంతో రైతులు ఉద్యమం చేస్తే, ఒక పార్టీ మాట్లాడదు, మరో పార్టీ మాట మారుస్తోంది అని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించమని ప్రధాని మోడీ సూచిస్తే దానిపై కేసిఆర్ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.
Also Read : ప్రాజెక్టులపై సిఎంకు శ్రద్ధ లేదు: సోము