Monday, September 23, 2024
HomeTrending Newsఉరుసు ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు: అంజాద్

ఉరుసు ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు: అంజాద్

Kadapa Dargah:
కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు ప్రత్యేక ఏర్పాట్లతో నిర్వహిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి అంజాద్ భాషా వెల్లడించారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే ఉత్సవాలు 25 వరకూ సాగుతాయని, ప్రస్తుత కోవిడ్ థర్డ్ వేవ్, ఓమిక్రాన్ వార్తల నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. వేడుకలకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, కోవిడ్ దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అయన  పేర్కొన్నారు.

దర్గా గంధం, ఉరుసు మహోత్సవం యధావిధిగా జరుపుతామని అంజాద్ చెప్పారు. ఎప్పటిలాగే ప్రభుత్వం తరఫున చాదర్ ను సమర్పిస్తామని, కానీ ముషాయిరా, ఊరేగింపు, జ్యూరస్ కార్యక్రమాలు రద్దుచేశామన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మతగురువుల సూచన మేరకు ఉరుసు మహోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు.

Also Read : తెలుగు భాష కళ్ళలాంటిది: వెంకయ్యనాయుడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్