Balayya : నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం అఖండ. ఈ సినిమా అంచనాలను మించి అద్భుతమైన విజయం సాధించింది. ఈ సందర్భంగా అఖండ టీమ్ ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. “అఖండ సినిమా అఖండమైన విజయం సాధించింది, ఈ విజయాని పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకున్నాం. ప్రేక్షకులు సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి రావడం సంతోషం. నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారు.. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడిన సినిమా ‘అఖండ’. సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు. ఏదైనా మంచి పని తలపెడితే విజయం తధ్యం.. అమ్మవారి అశీస్సులతో సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది. మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. టిక్కెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నాం.. ఏదైతే అదవుతుందని సినిమా విడుదల చేశాం. సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్టెప్ వేశాం. కొంత మంది ఆగినా.. మేమెక్కడా వెనుకడుగు వేయలేదు” అన్నారు.
“న్యాయ నిర్ణేత దేవుడే… దేవుడున్నాడు. మంచి కథ వస్తే మల్టీస్టారర్ సినిమా తీస్తాం. ఈ విజయం పరిశ్రమకు ఊపిరినిచ్చింది. ‘అఖండ’ విజయంతో మిగతా వారికి ధైర్యం వచ్చింది.. అందరూ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా టిక్కెట్ల వ్యవహారం పై నా వంతుగా నేను గతంలో మాట్లాడాను. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తానంటుంది.. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి, దాని బట్టి స్పందిస్తాను” అన్నారు.
Also Read : ఓవర్ సీస్ లో 1 మిలియన్ క్రాస్ చేసిన అఖండ