Monday, January 20, 2025
HomeTrending NewsRaithe Rajaithe: తెలంగాణ మట్టిలోనే కలిసిపోతాను - కెవిపి

Raithe Rajaithe: తెలంగాణ మట్టిలోనే కలిసిపోతాను – కెవిపి

తాను ఆంధ్ర కాదు.. ఆ ప్రాంతాన్ని వదిలేసి 40 ఏళ్లు అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావు అన్నారు. తనను తెలంగాణ పౌరుడిగానే గుర్తించండి.. ఇక్కడి మట్టిలోనే కలిసిపోతానని భావోద్వేగంతో అన్నారు. వై ఎస్ ఆర్ 14వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సభ్యుడు రఘువీరా రెడ్డి తో కలిసి రైతే రాజైతే పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాని కెవిపి రామచంద్ర రావు హైదరాబాద్లో నిర్వహించారు.

ఈ సందర్భంగా కెవిపి ప్రసంగం ఆయన మాటల్లోనే ..

ఇక్కడే(తెలంగాణలో) ఉంటున్నాం.. వారిమీద(కుటుంబ సబ్యులు) ఒట్టేసి చెబుతున్నా…కనీసం సగం తెలంగాణ వాడిగానైనా గుర్తించండి. 2023లో మనం అధికారంలోకి వస్తాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలని వైఎస్ చెప్పేవారు. రెండు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లను గెలిపించుకోవాలి. ఈ పుస్తకావిష్కరణ కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు కృతజతలు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బిజీగా వున్న దిగ్విజయ్ సింగ్ రావడం సంతోషం.

నాడు వైఎస్ ను చూసి నేటి తరం నేర్చుకోవాలని చెప్పిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. రేవంత్ ను చూస్తుంటే.. వైఎస్ తరహాలోనే ప్రభుత్వాన్ని తీసుకొస్తారనే విశ్వాసం ఉంది. ప్రజా ప్రస్థానం పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర చేసిన మల్లు భట్టి విక్రమార్కకి ధన్యవాదాలు. ఉభయ రాష్ట్రాల్లో వైఎస్ ప్రజా సంక్షేమ పథకాలను గుర్తుచేస్తాం..మళ్లీ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్