Saturday, November 23, 2024
HomeTrending Newsమా ప్రభుత్వం రాగానే 217 జీవో రద్దు: పవన్

మా ప్రభుత్వం రాగానే 217 జీవో రద్దు: పవన్

We are for fishermen: రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 217తో లక్షలాది మంది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు, 2024లో ఏర్పడబోయే జనసేన ప్రభుత్వంలో ఈ జీవోను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ జీవో కాపీని పవన్ కళ్యాణ్ చింపివేశారు… ఇలా చేయడం చట్ట విరుద్ధం అని తెలిసినా లక్షలాది మంది పొట్టగొడుతున్నారు కాబట్టి ఇలా చేశానని, తనపై కేసులు పెడితే జైలుకెళ్ళడానికైనా సిద్ధమేమేనని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మత్స్యకారుల అభ్యున్నతి సభ లో పవన్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

⦿ 60 నుండి 75 లక్షల జనాభా ఉన్న దాదాపు 38 కులాల ప్రజలు తీరప్రాంతాల్లో, 575 గ్రామాల్లో మత్స్యకారులుగా జీవిస్తున్నారు. వారి అందరి భవిష్యత్తు కోసం మేము వచ్చాం

⦿ జెట్టీలు నిర్మిస్తాం అని చెప్పారు. ఇప్పటికి తొలి దశ నిర్మాణాలు కూడా నామమాత్రపు పనులు మాత్రమే చేపట్టారు

⦿ శ్రీకాకుళం జిల్లా కపాసకుద్ధి గ్రామంలో గంగమ్మ తల్లి పూజ చేసి పోరాట యాత్ర మొదలుపెట్టడానికి కారణం గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి, మీకు అండగా నిలబడటానికి

⦿ నెల్లూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ అని చెప్పి 217 జీవో ప్రవేశపెట్టి ఇప్పుడు తీరప్రాంత జిల్లాలన్నింటిలో ప్రవేశపెడుతున్నారు, మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు

⦿ మత్స్యకారులు నివసించే ప్రాంతాలని డంపింగ్ యార్డులుగా మారుస్తున్నారు అధికారులు, వారి మీద ఎందుకీ వివక్ష?

⦿ తుఫాన్ చట్టం గురించి ఏ ఒక్కరూ మాట్లాడరు. తప్పుడు చట్టాలు వచ్చినప్పుడు కూడా ఎవరూ మాట్లాడరు. మాట్లాడకపోతే సమస్యలు ఎలా తీరుతాయి

⦿ దేహీ అనే పరిస్థితి లేకుండా మీ కాళ్ళమీద మీరు నిలబడేలా, మత్స్యకారులకు అండగా నిలబడేలా వచ్చే ఎన్నికల్లో మ్యానిఫెస్టో తీసుకొస్తాను

⦿ మత్స్యరుల ఓట్లు కావాలి, కానీ వారిలో వారికే గొడవలు పెడతారు ఈ వైసీపీ నాయకులు

⦿ జీవో కాపీ చించడం తప్పు అని తెలుసు, కేసులు పెడతారని తెలుసు, అయినా సరే మీ తరపున పోరాటం చేయడానికి చించాను, ఏం చేస్తారో చూద్దాం

⦿ ఇప్పటికే కోట్లు సంపాదించిన వారు  వేలంపాటలో చెరువులను పాడకండి. దయచేసి వాటిని మత్స్యకారులకు వదిలేయండి

⦿ వైసీపీ వారు పాదయాత్రలు చేసింది అధికారం లోకి వచ్చింది మటన్ కొట్టులు పెట్టుకోవడానికి, చేపలు అమ్ముకోవడానికా ?

⦿ మత్స్యకారులకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు ఈ వైసీపీ ప్రభుత్వం

⦿ 151 ఎమ్మెల్యేలు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం చికెన్ కొట్లు, మటన్ కొట్లు, చేపల కొట్లు పెట్టుకోడానికా? ఈ మాట మీరు ఎన్నికల ముందే చెప్పాల్సింది కదా

⦿ ఒక ఎమ్మెల్యే కూడా లేని మన జనసేన కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతే 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. అలాంటిది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతే లక్షల కోట్ల ⦿ బడ్జెట్ ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎందుకు భీమా ఇవ్వలేకపోతుంది

⦿ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండి ఉంటే జీవో 217 తీసుకొచ్చేవారు కాదు. ఈరోజు దానిని చింపేస్తున్నాను. వైసీపీ వాళ్ళు కేసులు పెడితే పెట్టుకోండి చూద్దాం

⦿ ఒక చిన్న నాటు పడవ వేసుకుని సముద్రంలో వేటకు వెళ్లి చేపలు పట్టుకునే మత్స్యకారుల పొట్ట కొట్టడానికి ఈ జీవో 217 తీసుకొచ్చారు

⦿ ఎంతో సాహసం చేసే గుంపు మత్స్యకారుల వర్గం. ఎంతో ధైర్యంగా సముద్రంలో వేటకు వెళతారు. ఆలాంటి సాహస వీరులకు నేను అండగా ఉంటాను

⦿ బొమ్మిడి నాయకర్ లాంటి బలమైన వ్యక్తి, మత్స్యకార కుటుంబాల నుండి వచ్చిన వ్యక్తి, ఓడిపోయినా సరే బలంగా ప్రజల మధ్యన ఉన్న వ్యక్తి . అటువంటి ⦿నాయకుడు మనకు ఉన్నాడు

⦿ అసలు సమస్యే లేని చోట సమస్య సృష్టించగలిగే ఉద్దండులు వైసీపీ నాయకులు. వారే లేని సమస్య సృష్టించి దాన్ని పరిష్కరించాం అంటారు

⦿ ఏ గ్రామానికి వెళ్లిన కూడా అభివృద్ధి లేదు. నీరు లేదు, వైద్యం లేదు, విద్య లేదు. పక్కనే గోదావరి ఉన్నా సరే మత్స్యకార గ్రామాలకు త్రాగునీరు అందించలేకపోతున్నారు. కానీ మద్యం మాత్రం అందిస్తున్నారు

⦿ ప్రజలు ఉన్న కష్టాలనే తట్టుకోలేకపోతుంటే, ఇంకా కష్టాలు పెడతారా? మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించాలా? మీరేమైన రాచరికంలో ఉన్నారు అనుకుంటున్నారా

⦿ తీర ప్రాంతాన ఉన్న మత్స్యకార గ్రామాల్లో కనీసం   త్రాగేందుకు మంచి నీరు ఇవ్వలేకుండ ఉన్నాయి.. ఇది గత ప్రభుత్వాల, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యమే..

⦿ ఇప్పటికీ గంగ పుత్రులకి మంచి నీరు సౌలభ్యం కూడా లేకపోవడం చాలా శోచనీయం

⦿ మేము జీవో 217 కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు పోరాటంలో భాగస్వామ్యం తీసుకోవాలి

⦿ సంయమనం పాటిస్తున్నాం అని చేతకాని తనం అనుకోవద్దు. ఈ వైసీపీ ప్రభుత్వం జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు సృష్టిస్తే చూస్తూ ఉరుకోము

⦿ పదేపదే మా వాళ్లపై. అక్రమ కేసులు బనాయించి  భయపెట్టాలని చూస్తే ఏ స్థాయికైనా వచ్చి ఎదురునిలబడతాను జాగ్రత్త

⦿ వైసీపీ వారికి భయం లేదు, తెప్పిస్తాం వాళ్ళకి భయం తెప్పిస్తాం

⦿ ప్రజల కోసం పోరాటం చేసి జైల్లోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు భయం లేదు. ఈరోజు ఇక్కడికి ఇంతమంది మత్స్యకార కుటుంబాలు వచ్చాయి ⦿ అంటే వారి కష్టాలు తీరాలని, మేము పోరాటం చేస్తాం, మీరు అండగా నిలబడండి

Also Read ప్రజలకు దత్త పుత్రుడిని: పవన్ కళ్యాణ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్