Wednesday, May 7, 2025
HomeTrending Newsవచ్చే ఏప్రిల్ నాటికి డా. అంబేద్కర్ విగ్రహం

వచ్చే ఏప్రిల్ నాటికి డా. అంబేద్కర్ విగ్రహం

By next April: విజయవాడలో 268 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 100 కోట్ల రూపాయలు గ్రీన్ ఛానెల్ లో పెట్టామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు.  విజయవాడ పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ప్రదేశాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలిసి పరిశీలించారు.  ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కాంస్య విగ్రహ ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు.

సిఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని , 20 ఎకరాల ప్రాంగణాన్ని కేటాయించామని  మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బి. ఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంగా దీనికి పేరు పెడతామని  వివరించారు.  చంద్రబాబు గతంలో ఎక్కడో పొలాల్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారని, కానీ సిఎం జగన్ నగరం నడిబొడ్డున అంబేద్కర్  విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించారని  మంత్రి వెల్లంపల్లి వివరించారు.

Also Read : జనం మనిషి..జగదేవ్ పూర్ గాంధి

RELATED ARTICLES

Most Popular

న్యూస్