Monday, January 20, 2025
HomeTrending Newsపోరాటం ఉదృతం చేస్తాం - కెసిఆర్

పోరాటం ఉదృతం చేస్తాం – కెసిఆర్

Intensify The Struggle Kcr  :

వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి వెల్లడించాలని ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ముగింపు ఉపన్యాసంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూర్పార బట్టారు.

కెసిఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసం పోరాటం ఉదృతం చేస్తాం. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదు. గత ఏడాది వడ్లు కొనకపోతే బిజెపి కార్యాలయం మీద కుమ్మరిస్తాం. భారత రైతాంగ హక్కుల సాధన కోసం తెరాస నాయకత్వ బాధ్యతలు తీసుకుంటుంది. బీసి జనాభా లెక్కలు చేపడితే వారికి న్యాయం జరుగుతుందని తెలంగాణ అసెంబ్లీ లో తీర్మానం చేస్తే కేంద్రం కనీసం పట్టించుకోవటం లేదు. నదుల అనుసంధానం చేస్తే దేశంలో 40 కోట్ల ఎకరాలను సస్యశ్యామలం చేయొచ్చు. కేవలం ఎన్నికలు వచ్చినపుడు హిందూ ముస్లీం మధ్య తగాదాలు, పాకిస్తాన్ పేరు చెప్పి ఓట్లు వేయించుకునేందుకా మిమ్మల్ని ఎన్నుకుంది. దేశంలో నాలుగు కోట్ల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. దేశానికి అవసరమైంది, వాడుతున్నది కేవల రెండు వేల కోట్ల మెగా వాట్లు మాత్రమె. పైనుంచి వ్యవసాయ క్షేత్రాలలో మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. నీటి పన్ను లేకుండా దేశంలో నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమె.

తెలంగాణలో అరవై రెండు లక్షల ఎకరాల్లో సాగు అవుతోందంటే వినని కేంద్రం ఆ తర్వాత అధికారులతో నివేదికలు తెప్పించుకొని యాభై తొమ్మిది లక్షల ఎకరాలు ఉందని చెప్పారు. ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్ళు కాదు. దేశం కోసం పంట పండిస్తే కొనకుండా కళ్లాల దగ్గరికి ఎందుకు పోతున్నారు. గత ఏడాది వడ్లు గోదాముల్లో మూలుగుతున్నాయి వాటిని కొంటారా లేదా? ఏసంగిలో వరి వేయమంటారా వద్దా చెప్పాలి.

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాడుతుంది. రెండు, మూడు రోజులు చూసి యుద్ధం ఎక్కడి వరకు తీసుకెళ్ళాలో అక్కడి వరకు తీసుకెళతాం. మా రైతులు మళ్ళీ నష్టపోవద్దు అనేది మా ఆరాటం. తెరాస మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు రైతుల కోసం ధర్నా చేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా ? తెలంగాణ రైతాంగం కోసం ఎక్కడి వరకైనా పోరాటం కొనసాగిస్తామని మరోసారి కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాను.

Also Read :

వరి వేదన

RELATED ARTICLES

Most Popular

న్యూస్