No Back-step: ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలనేది ప్రభుత్వ విధానమని ఈ విషయంలో వెనక్కు వెళ్ళేది లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, దీనిపై త్వరలోనే ఓ సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సచివాలయంలో నేడు ఉపాధ్యాయ సంఘాల నేతలలో మంత్రి బొత్స సమావేశమయ్యారు. అనతరం మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై కూలంకషంగా చర్చించామని, వారికున్న అపోహలను తొలగించామని, 117జీవో లో ఉపాధ్యాయుల అభ్యంతరాలు సవరించి కొత్త జీవో ఇస్తామని చెప్పారు. 3,4,5 తరగతులను ఉన్నత పాతశాలలో విలీనం చేస్తామని, 21మంది విద్యార్థులు ఉన్న చోట ఇద్దరు ఎస్జీటీలను నియమిస్తామని బొత్స వివరించారు. స్కూళ్ళ మూసివేతపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బొత్స వ్యాఖ్యానించారు.
అనంతరం ప్లీనరీ వేదిక వద్ద బొత్స మాట్లాడుతూ పార్టీ ఏర్పాటు తరువాత ఇప్పటికి రెండు ప్లీనరీలు నిర్వహించామని, గత ప్లీనరీలో ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారని, ఆ హామీలను నమ్మిన ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికి అధికారం ఇచ్చారని బొత్స వివరించారు. మూడేళ్ళుగా తమ ప్రభుత్వం నాడు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. కరోనా కారణంగా ప్లీనరీ రెండేళ్లుగా నిర్వహించలేకపోయామని, రేపటి నుంచి మొదలయ్యే ప్లీనరీలో రాష్ట్రంలోని అన్ని అంశాలపై చర్చిస్తామని వివరించారు.