Wednesday, March 18, 2026
Homeసినిమాబన్నీ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా పుష్ప‌ : నిర్మాతలు

బన్నీ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా పుష్ప‌ : నిర్మాతలు

Pushpa: The Rise:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్లలో ఈ నెల 17న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పుష్ప చిత్ర‌ నిర్మాతలతో పాటు మైత్రీ మూవీమేకర్స్ సీఇవో చిరంజీవి చెర్రీ మీడియాతో మాట్లాడుతూ “పాన్ ఇండియన్ సినిమా చేయాలనే మా కల పుష్పతో తీరనుంది. దర్శకుడు సుకుమార్ చెప్పిన కథ వినగానే అన్ని భాషల వారికి చేరువయ్యే యూనివర్శల్ కథ అవుతుందనిపించింది. అరుదైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు మానవీయ విలువలు, భావోద్వేగాల‌ కలబోతగా చక్కటి అనుభూతిని పంచుతుంది. రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నిడివితో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠభరితంగా.. ఆసక్తికరంగా సాగుతుంది.

సినిమాలో ప్రతి పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ నటన అద్భుతం. స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. మాస్ కథకు క్లాస్ హంగులను మేళవిస్తూ అన్ని వర్గాల్ని అలరించేలా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తీర్చిదిద్దారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటల్ని స్వరపరిచారు. ఈ ఆల్బమ్‌లోని అన్ని పాటలు సూపర్‌హిట్ అవ్వడం ఆనందంగా ఉంది. సినిమా చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని అరుదైన లొకేషన్స్‌ లో షూటింగ్ చేశాం. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనుకుంటున్నాం. ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. ‘అఖండ’ విజయం మాలో కూడా ఉత్సాహాన్ని నింపింది. ఆ విజయ పరంపరను మా చిత్రం కొనసాగిస్తుందనే నమ్మకముంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త పంథాలో అల్లు అర్జున్ కనిపిస్తారు. చిత్తూరు యాసలో ఆయన చెప్పిన సంభాషణలు మెప్పిస్తాయి.

Pushpa Movie Censor Completed

బన్నీ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమా కోసం ఏడాది మొత్తం పుష్పరాజ్ పాత్రలోనే ఉండిపోయారు. ఆయన మేనరిమ్స్ విభిన్నంగా ఉంటాయి. పుష్పరాజ్ పాత్రకు సంబంధించి ఆయన మేకప్‌కోసమే ప్రతిరోజు రెండు గంటలు సమయం పట్టేది. ఫహాద్‌ ఫాజిల్ మా అందరి ఊహలకు మించి అద్భుతంగా నటించాడు. రష్మిక మందన్న, సునీల్, అనసూయతో పాటు ప్రతి క్యారెక్టర్ సహజత్వాన్ని ప్రతిబింబిస్తూ కొత్త రీతిలో సాగుతాయి. ప్రతీ భాషలోనూ చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌నే చూపించాం. పుష్ప సెకండ్‌పార్ట్ షూటింగ్‌ను ఫిబ్రవరిలో మొదలుపెడతాం. ప్రస్తుతం మా సంస్థలో మహేష్‌బాబు సర్కారువారి పాట, నానితో ‘అంటే సుందరానికి’ సినిమాలు చేస్తున్నాం. చిరంజీవి సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. బాలకృష్ణతో చేయబోతున్న చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్‌ పైకి తీసుకొస్తాం. కల్యాణ్‌రామ్‌తో అమిగోస్ అనే చిత్రం చేయబోతున్నాం అన్నారు.

Also Read : పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా.. ఫైర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular