Wednesday, March 11, 2026
HomeTrending NewsKarumuri: యువ గళం ముసుగులో రౌడీ షీటర్లు: కారుమూరి

Karumuri: యువ గళం ముసుగులో రౌడీ షీటర్లు: కారుమూరి

యువ గళం పాదయాత్ర పేరుతో రౌడీ మూకలను తీసుకొచ్చి దాడులు చేయిస్తే సహించేది లేదని, ఇలాంటి దాడులను ఎత్తి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తారని, ఇలాంటి జిల్లాలో అలజడులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నిన్నటి ఘటనలో పోలీసులు చర్యలు తీసుకోవాలని.. దాడికి పాల్పడ్డ వారిమీద, ప్రోత్సహించిన వారిపైన కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వాళ్లంతా యువగళం పేరుతో రెడ్‌ టీషర్టులు వేసుకున్న రౌడీషీటర్లని,  తనతో పాటు అసాంఘిక శక్తులను తిప్పుకుంటూ ఇలాంటి చర్యలకు లోకేష్ పాల్పడుతున్నాడని విమర్శించారు. తణుకులో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు:

  • వ్యూహాత్మకంగా కర్రలు, రాడ్లతో గొడవలు సృష్టిస్తున్నారు. నూజివీడు, నిడపనీడులోనూ ఇలానే దాడులకు పాల్పడితే వారిని అరెస్ట్‌ చేశారు.
  • భీమవరంలోకి ఆయన పాదయాత్ర రాగానే మరిన్ని గొడవలకు రూపకల్పన చేశారు.
  • అక్కడ మా పార్టీ పెట్టిన ఫ్లెక్సీలను చించివేసి, కావాలని వివాదాలు సృష్టించాడు.
  • స్థానిక ఎమ్మెల్యే..టీడీపీవారు చింపిన ప్లెక్సీ స్థానంలోనే మరొక ప్లెక్సీ కూడా పెట్టుకున్నాడు.
  • లోకేశ్‌ తన ప్రసంగంలో దుర్భాషలాడుతూ, స్థానిక ఎమ్మెల్యేపై బూతులు తిడుతూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడు.
  • అతను అసలు చదువుకున్నాడో లేదో కూడా అర్ధం కాకుండా ఇష్టానుసారంగా  మాట్లాడాడు.
  • అతనే ఆ ఫ్లెక్సీలను చూపించుకుంటూ తన పక్కన ఉన్న వాలంటీర్లను రెచ్చగొట్టాడు.
  • రెడ్‌ బనియన్లు వేసుకున్న వారు యువగళం వాలంటీర్ల ముసుగులో ఉన్నవారంతా రౌడీలే.
  • కర్రలు, రాళ్లతో ప్రజలన భ్రయబ్రాంతులకు గురిచేశారు. భీమవరంలో ఇళ్లలోకి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు.
  • మీరెన్ని కేసులు పెట్టించుకుంటే అంతటి పెద్ద పదవులు ఇస్తానంటూ ఆ పార్టీ కార్యకర్తలకు లోకేశ్‌ బహిరంగంగానే ఆఫర్ ఇస్తూ వస్తున్నాడు.
  • దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ రెచ్చి పోతూ, దాడులు చేస్తూ, దౌర్జన్యంగా స్వైరవిహారం చేశారు.
  • పోలీసులను కూడా గాయపరిచారు. వారిలో ఐదారు మంది గాయపడితే ఒకరికి సీరియస్‌గా ఉంది.
  • మొన్న తండ్రి పుంగనూరులో…నేడు తనయుడు భీమవరంలో విధ్వంస కాండ సృష్టించారు.
  • అసలు మీ యాత్ర ఉద్దేశం ఏంటి..? రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..?
  • తండ్రీ కొడుకులు ఇద్దరూ ఫ్రస్టేషన్లో ఉన్నారు. ఐటీ నోటీసులతో మీరు దొరికిపోయారు.
  • మీరు దోపిడీ చేసిన డబ్బు ఎలా తీసుకువచ్చారో స్పష్టంగా లెక్కలతో సహా బయటపడింది.
  • టిడ్కో ఇళ్ల పేరుమీద వందలాది కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి డొల్ల కంపెనీల ద్వారా తెప్పించుకున్న తీరు కూడా బయట పడింది.
  • నేరుగా ఐటీ శాఖ నోటీసులు పంపితే.. దానిలో రూ.118 కోట్లు చంద్రబాబుకు ముడుపులు అందాయని తేల్చింది.
  • లోకేశ్‌కు కూడా ఆ స్కాంలో భాగస్వామ్యం ఉందని తెలిసే సరికి ప్రజలను భయబ్రాంతులను చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
  • ఇతనేదో పెద్ద పోటుగాడిలా ఫ్లెక్సీలను చూపిస్తూ దాడికి ఉసిగొల్పాడు.
  • ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఐటీ నోటీసుల  ఫ్రస్టేషన్‌ ను తండ్రీ కొడుకులు ప్రజల మీద చూపిస్తున్నారు. ఈ దుర్మార్గాలు ఇక సాగవు.
  • మీ నాన్న, మీ తాతను వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు మీరిద్దరూ ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారు.
  • ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular