Tuesday, March 10, 2026
HomeTrending NewsYSRCP Bus Yatra: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ బడుగులకు ప్రాధాన్యం

YSRCP Bus Yatra: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ బడుగులకు ప్రాధాన్యం

నాలుగున్నరేళ్ల క్రితం ప్రజలు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని, వైఎస్సార్‌సీపీ పార్టీకి ఓటేసి గెలిపించినందునే నేడు సామాజిక సాధికారత సాధ్యమైందని, సామాజిక న్యాయమంటే ఏంటో తెలిసిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జగనన్న పాలనలో జరిగిన లబ్ది గురించి  వివరించేందుకే బస్సు యాత్రకు వచ్చామని వెల్లడించారు.

కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరులో సాగిన సామాజిక సాధికార యాత్రకు నియోజకవర్గంలోని పల్లెపల్లె నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో డిప్యూటీ సీఎం అంజాద్‌భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు; ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుకలతో పాటు జిల్లాపరిషత్‌ ఛైర్మన్, ఆర్టీసీ ఛైర్మన్‌ యాదవ కార్పొరేషన్ ఛైర్మన్‌… స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రి సురేష్ మాట్లాడిన ముఖ్యాంశాలు:
⦿ జగనన్న పాలన అవినీతిరహితంగా, పారదర్శకంగా, సమర్ధంగా సాగుతోంది
⦿ బీఆర్‌ అంబేడ్కర్, జోతిరావు ఫూలే, బాబుజగజ్జీవన్‌ రామ్‌ లాంటి మహనీయులు..అట్టడుగు వర్గాలకు మేలు జరగాలని నిరంతరం తపించారు
⦿ వారి ఆశయాల బాటలో నడుస్తున్న జగనన్న బడుగు, బలహీనవర్గాల వారిని చేయిపట్టుకుని ముందుకు తీసుకెళుతున్నారు
⦿ మన పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తుకు..విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు
⦿ సంక్షేమ పథకాలతో పేదలను ఆర్థిక స్వావలంబన దిశలో నడిపిస్తున్నారు
⦿ గతంలో చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాలను ఏమాత్రం పట్టించుకోలేదు
⦿ వారికి సామాజిక సాధికారత, న్యాయం చేయకుండా కుటిల రాజకీయాలు చేశారు. వారిని చులకన చేశారు, అవమానించారు.
⦿ ఈరోజు జగనన్న పాలనలో ఈ వర్గాల వారు పార్లమెంటు నుంచి గ్రామపంచాయితీ వరకు పదవుల్లో ఉన్నారు
⦿ మీకు ఏదైనా మంచి జరిగితేనే నాకు ఓటెయ్యమని చెబుతున్న దమ్మున్న నాయకుడు జగన్
⦿ మాట తప్పని మనిషి, ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి జగనన్నే మన భరోసా

కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడిన అంశాలు:
⦿ బడుగు, బలహీనవర్గాలు, పేద ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అది జగన్‌ పాలన వల్లనే
⦿ ఆయనకు పేదలంటే ప్రాణం. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలంటే అంతులేని అభిమానం.
⦿ సామాజిక సాధికారతను ఆచరణలోకి తీసుకొచ్చి …చట్టసభల్లో పెద్దపదవుల్లో కూర్చోబెట్టారు
⦿ రూ.4,450కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఈ కమలాపురం నియోజకవర్గంలో జరుగుతున్నాయంటే..అదంతా సీఎం జగన్‌ తోడ్పాటే.
⦿ ఈ పనులన్నీ త్వరలో పూర్తవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular