వాసాలమర్రిలోని దళిత కాలనీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తుండగా.. స్వల్పంగా వాన కురిసింది. అయినప్పటికీ కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. ఆ వానలోనే నడక సాగిస్తూ.. దళితుల్లో చైతన్యం నింపారు. దళిత బంధు పథకం ఉద్దేశాలను వివరించారు. ఆ పథకంపై దళితుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
పర్యటన గంటకు పైగా కొనసాగింది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దయనీయంగా ఉన్న దళితుల ముఖాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వాసాలమర్రి పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితో పాటు పలువురు అధికారులు ఉన్నారు.