Sunday, January 19, 2025
HomeసినిమాNaga Chaitanya: ఆ సినిమాకి నాగచైతన్య నో చెప్పాడా..?

Naga Chaitanya: ఆ సినిమాకి నాగచైతన్య నో చెప్పాడా..?

అక్కినేని నాగైతన్య ప్రస్తుతం చందు మొండేటితో సినిమా చేస్తున్నారు. ఇది కొన్ని యధార్థ సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న సినిమా. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇది ఓ మత్య్యకారుడు ప్రేమకథ. అందుచేత ఈ యధార్ధ కథ గురించి మరింతగా తెలుసుకునేందుకు నాగచైతన్య, చందు మొండేటి, బన్నీ వాసు కలిసి శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్య్స కారులను కలిసి మరిన్ని విషయాలను తెలుసుకోవడం జరిగింది.

ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. వచ్చే సమ్మర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నాగచైతన్యకు ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయమని ఆఫర్ వచ్చిందట. కేవలం పది రోజుల షూటింగ్ కి ఏకంగా 9 కోట్లు ఆఫర్ చేశారట. అయితే.. చైతన్య ఏమాత్రం ఆలోచించకుండా నో చెప్పారట. స్పెషల్ క్యారెక్టర్ చేయడం కోసం 15 కోట్లు తీసుకున్న హీరోలు ఉన్నారు. అలాంటిది జస్ట్ 10 రోజుల షూటింగ్ కి 9 కోట్లు అంటే.. ఎవరైనా ఓకే అంటారు కానీ.. చైతన్య అలా కాదు.. ఏమాత్రం ఆలోచించకుండా నో చెప్పాడట.

కారణం ఏంటంటే.. డబ్బులు ముఖ్యం కాదు.. మంచి కథలతో మంచి పాత్రలు చేయాలి అనుకుంటున్నాడట. అందుకనే గెస్ట్ రోల్ చేయడానికి నో చెప్పాడట. అయితే.. 9 కోట్ల ఆఫర్ ను వదులుకున్నాడని ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. చందు మొండేటితో చేస్తున్న సినిమా తర్వాత శివ నిర్వాణతో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇలా చైతన్య ఇక నుంచి మంచి కథలకే ప్రాధాన్యత ఇస్తూ డిఫరెంట్ మూవీస్ చేయాలి అనుకుంటున్నాడట. మరి.. చందూ, శివ నిర్వాణ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్