Saturday, January 18, 2025
Homeసినిమాగోపీచంద్ నమ్మకం నిజమయ్యేనా?

గోపీచంద్ నమ్మకం నిజమయ్యేనా?

Pakka Hit: టాలీవుడ్ లో మంచి హైట్ .. ఫిజిక్ ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒకరు. టి.కృష్ణ తనయుడిగా కాకుండా తనకు తానుగా ఎదగడానికి ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చాడు. తెలుగు తెరకి పరిచయమవుతూనే పెద్దగా గ్యాప్ లేకుండానే తన విలనిజం ఎలా ఉంటుందో .. తన హీరోయిజం ఎలా ఉంటుందో ఆయన ఆడియన్స్ కి చూపించాడు. సాధారణంగా ఒక విలన్ .. హీరోగా మారడానికీ, ఒక యాక్షన్ హీరో ఫ్యామిలీ హీరో అనిపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ గోపీచంద్ విషయంలో అవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి.

గోపీచంద్ కామెడీ చేయలేడేమో అనుకున్నారు . అలాగే డాన్సులు కష్టమేనేమో అని చెప్పుకున్నారు. కానీ ఆ విమర్శలకు  .. సందేహాలకు ఆయన పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ టచ్ ఉన్న కథలలో తనకి తిరుగులేదనిపించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ‘రణం’ .. ‘లక్ష్యం’ .. ‘లౌక్యం’ .. ‘జిల్’ వంటి హిట్లు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. ‘జిల్’ తరువాత ఆయన  ఓ అరడజనుకి పైగా సినిమాలు చేశాడు .. కానీ అవన్నీ కూడా నిరాశ పరిచాయి. కథలు .. కాలం కలిసిరాకపోవడమే అందుకు కారణం

‘జిల్’ సినిమాలో రాశి ఖన్నాతో కలిసి హిట్ కొట్టిన గోపీచంద్, ఆ తరువాత మళ్లీ హిట్ అనే మాట వినలేకపోయూడు. కథలో కొత్తదనానికి  ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే మారుతి దర్శకత్వంలో ఆయన ‘పక్కా కమర్షియల్‘ సినిమా చేశాడు. గీతా ఆర్ట్స్ 2 – యూవీ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. కథపై ఒక రేంజ్ లో కసరత్తు జరిగిన తరువాతనే సెట్స్ పైకి వెళ్లింది. అందువలన ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో గోపీచంద్ ఉన్నాడు.. వచ్చేనెల 1వ తేదీన థియేటర్లకు వస్తున్న ఈ సినిమా, ఆయన నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందేమో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్