Sunday, January 19, 2025
HomeTrending Newsకెసిఆర్ నియంతృత్వం మీద పోరాటం చేస్తా...

కెసిఆర్ నియంతృత్వం మీద పోరాటం చేస్తా…

Will Kcr Fight Dictatorship Eetela Rajender : 

తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను వదిలి బయటకు రావాలని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కోరారు. ఎనిమిదేళ్ళుగా వరి ధాన్యం కొన్నది ఎవరో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈటెల గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ధర్నాచౌక్ వద్దన్న వాళ్ళే ధర్నాచౌక్ లో ఆందోళన చేస్తానంటున్నారని, ధర్నాచౌక్ అవసరం ఏంటో కేసీఆర్ కు తెలిసొచ్చిందని ఎద్దేవా చేశారు.

బీజేపీ నాయకత్వంలో కేసీఆర్ నితంతృత్వ, అవినీతి పాలనపై పోరాటం చేస్తానని ఈటెల ప్రకటించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనని,  మిల్లింగ్ టెక్నాలజీని పెంచుకోవటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ గంటకొద్దీ ప్రెస్ మీట్స్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, కేసీఆర్ పెద్ద నోరుతో చెప్తోన్న అబద్దాలు నిజాలు అయిపోవని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ప్రజల మీద ప్రేముంటే  కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించాలన్నారు.

Also Read : నిరీక్షణకు తెర, విజయం నాదే: ఈటెల

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్