Sunday, January 19, 2025
Homeసినిమానాగ్.. చిరుకు ఈసారి కూడా డైరెక్టర్ ని ఇచ్చేస్తాడా..?

నాగ్.. చిరుకు ఈసారి కూడా డైరెక్టర్ ని ఇచ్చేస్తాడా..?

నాగార్జున, మోహన్ రాజాతో ఓ సినిమా చేయాలి అనుకున్నారు. ఇది భారీ యాక్షన్ మూవీ. ఇందులో ఓ కీలక పాత్రలో అఖిల్ నటించాలి. ఈ క్రేజీ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించాలి అనుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఇక త్వరలో సెట్స్ పైకి వెళుతుంది అనగా చిరంజీవి.. ‘గాడ్ ఫాదర్’ మూవీకి మోహన్ రాజా అయితే బాగుంటుంది. నాగ్.. మోహన్ రాజా నీతో సినిమా చేస్తున్నాడు కదా. అతనితో ముందుగా గాడ్ ఫాదర్ మూవీ చేసిన తర్వాత నీతో సినిమా చేస్తాడు అనగానే ఓకే అని చెప్పి నాగార్జున తన దర్శకుడిని ఇచ్చేశారు.

అయితే.. గాడ్ ఫాదర్ తర్వాత మోహనరాజాతో నాగ్ వెంటనే సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. ‘ది ఘోస్ట్’ మూవీ ప్లాప్ అవ్వడంతో వెంటనే యాక్షన్ మూవీ చేయకూడదు అనుకున్నారు. ఎంటర్ టైన్మెంట్ మూవీ చేయాలి అనుకున్నారు. బెజవాడ ప్రసన్న చెప్పిన స్టోరీ నచ్చడంతో దర్శకుడిగా అవకాశం అతనికే ఇచ్చారు. త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి నెక్ట్స్ నక్కిన త్రినాథరావుతో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఇటీవల నక్కిన చెప్పిన స్టోరీకి చిరంజీవి ఓకే చెప్పారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

చిరంజీవి సినిమా కోసం త్రినాధరావు-బెజవాడ ప్రసన్నకుమార్ కలిసి పనిచేస్తారా? లేక మరో రచయితతో త్రినాధరావు చిరంజీవి సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడా? అసలు ప్రసన్నకుమార్ ప్రాజెక్టులో లేకపోతే చిరంజీవి ఓకే చెబుతారా? ఇలా ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు. దీంతో గతంలో మోహన్ రాజాతో నాగార్జున సినిమా చేయాలనుకుంటే.. చిరంజీవి ఎలాగైతే లాగేసుకున్నారో.. ఇప్పుడు ప్రసన్నకుమార్ తో నాగార్జున సినిమా చేయాలనుకుంటే.. ఇప్పుడు కూడా చిరంజీవి లాగేసుకుంటారేమో అనే టాక్ వినిపిస్తుంది. అయితే.. నాగ్ ప్రసన్నతో మూవీని ఈ నెలలోనే స్టార్ట్ చేయనున్నారని సమాచారం. చిరు ‘భోళా శంకర్’ షూట్ లో ఉన్నారు. అందుచేత నాగ్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ప్రసన్న త్రినాథరావుతో వర్క్ చేసే అవకాశం ఉందంటున్నారు. మరి.. ఏం జరగనుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్