Tuesday, March 17, 2026
HomeTrending Newsమావో ప్రాబల్యం తగ్గింది : సుచరిత

మావో ప్రాబల్యం తగ్గింది : సుచరిత

గతంలో రాష్ట్రంలోని 5 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేదని, ఇప్పుడు కేవలం రెండు జిల్లాలకే పరిమితమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. న్యూఢిల్లీలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సమావేశంలో మంత్రి సుచరిత  మాట్లాడారు. రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్యాబలం 50కి పడిపోయిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, మనబడి నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించామని, అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15వేలు సహాయం చేస్తున్నామని, మహిళలకు సాధికారత కోసం ఐదేళ్ళలో రూ.75 వేలు సహాయం చేస్తున్నామని వివరించారు. ఈ పథకాలన్నీ ఆర్థికంగా స్థిరపడేందుకు తోడ్పడుతున్నాయని సమావేశంలో పేర్కొన్నారు.

సుచరిత మాట్లాడిన ముఖ్యాంశాలు:

⦾ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ పథకాలు ఉపయోగపడుతున్నాయి
⦾ సచివాలయ వ్యవస్థ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం
⦾ అటవీ ప్రాంతాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది.


⦾ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌కి తరలించాలి
⦾ మారుమూల ప్రాంతాలలో మూడు కిలోమీటర్లకు ఒక పోస్టాఫీస్ ఉండాలి
⦾ 4జీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి, దీనితో నక్సల్స్ ప్రాబల్యం తగ్గుతుంది
⦾ గతంలో ఎప్పుడు ఏ ల్యాండ్ మెయిన్ పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేది
⦾ ఏజెన్సీలో పర్యటించాలంటే భయపడే పరిస్థితి ఉండేది
⦾ ఇప్పుడు ఏజెన్సీలో రాజకీయ నేతలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉంది
⦾ అయితే ఇంకా ఈ సమస్య పూర్తిగా తొలగిపోలేదు. అందుకే ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తతతో ఉంది
⦾ మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ పెంచాలి, రోడ్లు వేసేందుకు ఉన్న ప్రతిబంధకాలను తొలగించి అనుమతివ్వాలి
⦾ అటవీ ప్రాంతాలలో టెలికాం, మౌళిక వసతులు సౌకర్యాలు పెంచాలి
⦾ విభజన చట్టం మేరకు సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి
⦾ బాక్సైట్ తవ్వకాలను ఆపేసిన నేపథ్యంలో, రాష్ట్రానికి అవసరమైన ఖనిజాలను ఒరిస్సా నుంచి ఇప్పించాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular