Tuesday, March 17, 2026
HomeసినిమాPushparaj: 'పుష్ప2' కీలక షెడ్యూల్ పూర్తి

Pushparaj: ‘పుష్ప2’ కీలక షెడ్యూల్ పూర్తి

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప-2’ ‘ది రూల్’ గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది హాట్‌టాపికే. పుష్పగా అల్లు అర్జున్ నటనకు, డైరెక్టెర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయిన సంగతి తెలిసిందే.  పుష్ప-2కు సంబంధించి ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వేర్‌ఈజ్ పుష్ప, హంట్ ఫర్ పుష్ప కాన్సెప్ట్ వీడియోకు, ఐకాన్‌స్టార్ లుక్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది.

మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర అందరిని ఎంతగానో అలరించింది. ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగంతి తెలిసిందే. పుష్ప-2లో కూడా ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉండబోతుంది. గత కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవి ప్రాంతంలో ఫహద్ ఫాజిల్‌ పై ముఖ్య ఘట్టాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తయింది. దీనికి సంబంధించిన ఓ స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఫహద్‌ఫాజిల్‌తో దర్శకుడు సుకుమార్ కనిపిస్తున్న ఈ స్టిల్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడు’ అంటూ క్యాప్షన్‌ను జత చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్‌ రైటింగ్స్ కలయికలో నిర్మాణం జరుపుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular