Monday, September 23, 2024
Homeసినిమారైట్ టైమ్ లో రిలీజవుతున్న 'రాంగ్ స్వైప్'

రైట్ టైమ్ లో రిలీజవుతున్న ‘రాంగ్ స్వైప్’

Wrong Swipe Will Be Streaming On Urvasi Ott From November 1st :

డాక్టర్ రవికిరణ్ గడలి దర్శకత్వంలో మెరూన్ వాటర్స్ ఎక్స్ లెన్స్ పతాకంపై డాక్టర్ ప్రతిమారెడ్డి నిర్మించిన సందేశాత్మక చిత్రం ‘రాంగ్ స్వైప్’. క్షణిక సుఖం కోసం పక్క దారి పడితే… ఎటువంటి విపరిణాలను ఎదుర్కోవలసి వస్తుందో వినోదాత్మకంగా చూపించే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఊర్వశి ఓటిటి ద్వారా నవంబర్ 1న విడుదల కానుంది. స్వతహా డాక్టర్ అయిన రవికిరణ్… సినిమా మాధ్యమం పట్ల విపరీతమైన ప్యాషన్ తో.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు స్వయంగా సమకూర్చుకుని, దర్శకత్వం వహించడంతోపాటు… ఛాయాగ్రహణం కూడా అందించడం విశేషం.

అంతేకాదు, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించారు. డాక్టర్ ఉదయ్ రెడ్డి, డాక్టర్ శ్రావ్యనిక, రాధాకృష్ణ, అనికా ప్రేమ్ ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ… “లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అన్నీ తానే అయి ముందుండి నడిపించారు. మెసేజ్ కి ఎంటర్టైన్మెంట్ జోడించి రూపొందిన ‘రాంగ్ స్వైప్’ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. కబీర్ రఫీ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్