ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్ నియమితులయ్యారు. దీనిపై ఆ పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఈ సాయంత్రంలోపు వెలువడే అవకాశాలున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజును కొద్ది సేపటి క్రితం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి పదవీ కాలం పూర్తయ్యింది కాబట్టి కొత్త చీఫ్ ను నియమిస్తున్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు.
అయితే చివరి నిమిషంలో ఏవైనా మార్పులు జరిగితే సత్య కుమార్ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు కూడా ఖరారయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.