ఆర్ధిక శాఖ ఉద్యోగులను సస్పెండ్ చేయడాన్ని మాజీ ఆర్ధిక శాఖమంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఖండించారు. మంత్రివర్గం తప్పుచేస్తే దానికి అధికారులు, ఉద్యోగులను ఎలా శిక్షిస్తారని అయన ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులకు మంత్రివర్గం ట్రస్టీగా వ్యవహరించాలే తప్ప యజమానిగా ఉండకూడదని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం అవినీతి, దుబారా చేస్తోందని, అందుకే ఆ సమాచారాన్ని రాజ్యంగ సంస్థలకు తెలియకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు.
కాగ్ నివేదిక, అసెంబ్లీ కి సమర్పించాల్సిన ఎఫ్ఆర్బిఎం, సి.ఎఫ్.ఎం.ఎస్. ప్రజలకు అందుబాటులో ఉంటాయని, ఆ విషయాలను ఎవరూ పనిగట్టుకొని లీక్ చేయాల్సిన అవసరం లేదని యనమల స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, ఉద్యోగుల సస్పెన్షన్ లతో ప్రజల దృష్టిని మల్లిస్తున్నారని యనమల విమర్స్య్హించారు. ఏడాదిలో ఏపి ప్రభుత్వం 60,371 కోట్ల రూపాయల అప్పు చేసిందని వెల్లడించారు.