Yanamala on Municipals:
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని, అయినా సరే విజయం ఏకపక్షంగా రాలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడినా తమ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడి పోటీ చేశారని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగాబడ్డారని అందుకే కొన్నిచోట్ల టిడిపి చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించిందని విశ్నేశించారు. జగన్ ప్రభుత్వ పతనానికి ఈ ఫలితాలు నాంది పలుకుతాయని అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ సమావేశాలను ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల శాసన మండలి లో విపక్ష నేతగా వ్యవహరిస్తున్న యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒక్కరోజు నిర్వహణను తాము వ్యతిరేకిస్తున్నమని, కనీసం రెండు వారాలపాటు సభా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిఎం జగన్ కు చాలారోజుల తర్వాత అసెంబ్లీ గుర్తుకువచ్చిందని అయన ఎద్దేవా చేశారు. సిఎంకు అసెంబ్లీ అన్నా, ప్రజలన్నా భయం పట్టుకుందని, అందుకే బైటకు రావడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అందుకే అభివృద్ధి కుంటుపడిందని వ్యాఖ్యానించారు. 2024 నాటికి రాష్ట్రం అప్పులు 5లక్షల కోట్లకు చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read :గాడిలో పెట్టండి: యనమల సూచన