Yash in: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ సలార్. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అభిమానులు సలార్ అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ మూవీ 50 శాతం షూటింగును పూర్తి చేసుకుంది. ఈ మూవీ టీజర్ గురించి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే సలార్ టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే..ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇక కేజీఎఫ్ హీరో యశ్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. తనకి సంచలన విజయాన్ని అందించిన దర్శక నిర్మాతలు అడిగిన కారణంగా యశ్ సలార్ లో నటించేందుకు ఓకే చెప్పాడట.
యశ్ ఈ మూవీలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. త్వరలో ప్రకటిస్తారని టాక్. విక్రమ్ సినిమాలో కార్తి ఖైదీ సినిమా ట్రాక్ కనిపించేలా లోకేశ్ కనగరాజ్ చేశాడు. ఇప్పుడు అదే విధంగా సలార్ మూవీలో యశ్ మెరవనున్నాడని చెబుతున్నారు. ఏది ఏమైనా సలార్ చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Also Read : సలార్ కి షాక్ ఇచ్చిన పృథ్వీరాజ్.