Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్ బ్యానర్ లో యాత్ర 2 నిజమేనా..?

ప్రభాస్ బ్యానర్ లో యాత్ర 2 నిజమేనా..?

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది రాజకీయ చిత్రం అయినప్పటికీ సామాన్య ప్రేక్షకులకు కూడా నచ్చింది. ఈ సినిమా ఎన్నికల టైమ్ లో వై.సీ.పీకి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పచ్చు. ఈ సినిమా సక్సెస్ తర్వాత ‘యాత్ర 2’ కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. మహి వి రాఘవ కూడా ఉంటుందని అనౌన్స్ చేయడంతో ఎవరితో ఉంటుంది..? ఎప్పుడు ఉంటుంది..? అనేది ఆసక్తిగా మారింది.

తాజా వార్త ఏంటంటే.. యాత్ర 2 చిత్రాన్ని ప్రభాస్ నిర్మాణ సంస్థ అయిన యు.వి. క్రియేషన్స్ బ్యానర్ లో ఉంటుందని.. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు 2024 ఎన్నికలకు ఉపయోగపడేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలిసింది. అయితే.. జగన్ పాత్రను ఎవరు పోషించనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ పాత్ర కోసం ఓ స్టార్ కోసం చూస్తున్నారని తెలిసింది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా సెట్ అయ్యిందట కానీ.. జగన్ పాత్ర పోషించే స్టార్ ఎవరు అనేదే ఇంకా ఖరారు కాలేదని.. ఈ పాత్రను పోషించేది ఎవరు అనేది క్లారిటీ వస్తే.. షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం.

యాత్ర సినిమాలో వై.ఎస్. పాత్ర పోషించిన మమ్ముట్టి తప్పితే మిగిలిన వాళ్లందరూ కొత్తవాళ్లే. అయితే… ఈసారి అలా కాకుండా స్టార్ బలం ఎక్కువ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే… ఈ చిత్రాన్ని నిర్మిస్తే.. యు.వీ సంస్థ పై ఆ పార్టీ ముద్రపడే అవకాశం ఉంది. యాత్ర 2 లో జగన్ పాత్ర ఎవరు పోషిస్తారో..? ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్