Sunday, January 19, 2025
HomeTrending Newsనేటి నుంచి యాసంగి రైతుబంధు

నేటి నుంచి యాసంగి రైతుబంధు

Yeasangi Raithubandhu :

రైతుబంధు కింద ఎనిమిది విడతలుగా  రూ.50 వేల కోట్లు  ఇప్పటి వరకు విడుదలయ్యాయి. ఈ రోజు నుంచి యాసంగి రైతుబంధు నిధుల పంపిణీ జరుగనుంది. ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు విడతలలో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ చేయగా ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ చేయడము అవుతుంది. 10 వ తేదీ డిసెంబరు నాటికి ధరణి పోర్టల్ నందు పట్టాదారులు మరియు కమీషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాదారులు అర్హులు. ఈ సీజన్ లో 66.61 లక్షల మంది రైతులుకు గాను 152.91 లక్షల ఎకరాలకు 7645.66 కోట్లు జమచేయడానికి సన్నద్ధము కావడము జరిగినది. దీనిలో 3.05 లక్షల ఎకరాలకు గాను 94 వేల మంది రైతులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాదారులు ఉన్నారు.

ఎకరా నుండి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా ఆరోహణా క్రమంలో రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.  రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాలలో ఒకటిగా రోమ్ లో 2018 నవంబరులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో గుర్తించిన ఎఫ్ ఎ ఓ.

Also Read : యాసంగిలో ధాన్యం కొనుగోలు బంద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్