Friday, March 13, 2026
HomeTrending Newsఅది యుద్ధం కాదు.. కామెడీ పోస్ట్ : కొడాలి నాని

అది యుద్ధం కాదు.. కామెడీ పోస్ట్ : కొడాలి నాని

తెలుగుదేశం- జనసేన – బిజెపి కలిసి యుద్ధం చేస్తాయా లేదా అనే విషయం ఇంతవరకూ బాబు, పవన్ కళ్యాణ్ లకు కూడా తెలియదని ఇక వారు ఎవరితో యుద్ధం చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నిన్న భీమవరంలో జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ చేసిన యుద్ధం కామెంట్స్ కు నాని ఘాటుగా బదులిచ్చారు.  ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారో,  ఎవరు ఎక్కడ యుద్ధానికి రెడీ అవుతారో కనీసం వాళ్లకు కూడా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.

బాబు, పవన్ లు ఎక్కడ…ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నారో కనీసం ఆ పార్టీ నేతలకు, సీట్లు ఆశించే వారికి అయినా తెలుసా అని నిలదీశారు.  బిజెపి వీళ్ళతో కలిసే యుద్ధం చేయబోతుందో …విడిగా చేస్తుందో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. ఏయే పార్టీలు ఎన్ని సీట్లు, ఏయే సీట్లలో ఏ పార్టీ అనేది వాళ్ళకే తెలియదని విమర్శించారు.

ఓ వైపు జగన్ సిద్ధం పేరుతో దూసుకు వెళ్తుంటే వీరు మాత్రం సిద్హం పక్కల ఫ్లెక్సీలు పెట్టడం తప్ప మరొకటి లేదని అన్నారు. ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం కాదు; సిద్ధం కాదని… కామెడీ పోస్ట్ అవుతుందన్నారు నాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular