Sunday, January 19, 2025
HomeTrending Newsమూల్యం చెల్లిస్తారు: అచ్చెన్నాయుడు హెచ్చరిక

మూల్యం చెల్లిస్తారు: అచ్చెన్నాయుడు హెచ్చరిక

Pay price: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ను టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.  జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి అక్రమ అరెస్ట్ లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ నిర్బంధాలకు పాల్పడుతోందన్నారు

ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారని అచ్చెన్న మండిపడ్డారు.  రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే.. నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.

రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని, పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారన్న అచ్చెన్నాయుడు ఇలాంటి అక్రమ అరెస్ట్ ల పట్ల భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Also Read : ఏపీ సిఐడి అదుపులో నారాయణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్