Wednesday, March 11, 2026
HomeTrending Newsజగన్ బస్సు యాత్రలో అనుకోని అతిథి

జగన్ బస్సు యాత్రలో అనుకోని అతిథి

శనివారం గుంటూరు జిల్లాలో బస్సు యాత్రను ముగించుకున్న సీఎం జగన్ ..ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగుపెట్టారు. దుర్గమ్మ వారిది మీదుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర అడుగుపెట్టింది. సీఎం జగన్‌కు జిల్లా వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీపై చేరుకున్న బస్సు యాత్ర చూసేందుకు అభిమానులు, వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. జగన్ కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

సీఎం జగన్ బస్సు యాత్ర తాడేపల్లికి జంక్షన్ కు చేరుకోగానే ఆయన సతీమణి వైఎస్ భారతి..సీఎం జగన్ కు అభివాదం చేశారు. ప్రజలు, అభిమానుల మధ్య నుంచే ఆమె అభివాదం చేయగా.. ప్రతిగా బస్సులో నుంచి సీఎం జగన్ ఆమెకు అభివాదం చేశారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

అక్కడి వారు వైఎస్ భారతితో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అభిమానులతో సరదాగా ముచ్చటించిన ఆమె.. వైసీపీకి మద్దతుగా నిలవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular