జగన్ లాంటి పాలకుడు రాజకీయాలకు అనర్హుడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని, ప్రజలకు సేవ చేయడానికి కాదని అన్నారు. ల్యాండ్ టైటిల్ చట్టం తెచ్చింది భూములు దోచేందుకేనని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చేది గోరంత..పబ్లిసిటీ మాత్రం కొండంత అని అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.‘‘శాంతిపురం నాకు కొత్త కాదు ఎప్పుడూ వస్తూనే ఉంటాను. కానీ మీలో ఈ సారి ప్రత్యేకమైన అభిమానం కనబడుతోంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. నిన్న, నేడు మీ ఉత్సాహం చూశాక మన కుప్పంలో టీడీపీకి లక్ష ఓట్ల మెజార్టీ కష్టం కాదనిపిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ జండా రెపరెపలాడే నియోజకవర్గాలు రెండున్నాయి…ఒకటి కుప్పం..రెండోది హిందూపురం” అని కార్యకర్తలను ఉత్తేజపరిచారు.
బాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
* టీడీపీ అధికారంలో ఉండుంటే హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ల వచ్చేవి.
* 2014 కు ముందు హంద్రీనీవాను పట్టించుకోలేదు.
* ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాను. వి.కోట దాకా నీళ్లు వచ్చాయి.
* 87 శాతం పనులు పూర్తయ్యాయి. 13 శాతం పనులు పూర్తిచేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైసీపీ.
* ఎందుకు కుప్పం అంటే మీకు చిన్నచూపు? కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తానని చెప్పి నీళ్లు ఇచ్చా..
* నీకు బాద్యత లేదా జగన్.? ఎందుకు ఈ నిర్లక్ష్యం ఇది ఎవరి పాపం.?
* 13శాతం పనులు పూర్తి చేసి ఉండుంటే నీళ్లు వచ్చేవి. పాలార్ లో 35 చెక్ డ్యాములు నిర్మించాము.
* చెరువులకు నీళ్లు కూడా అందేవి. కుప్పంలో కరువు అనేది లేకుండా చేయాలని చూస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
* ఏమొచ్చింది మీకు.? ఇక్కడకు ఒక మంత్రి పరుగెత్తుకు వస్తాడు .మన మీద ప్రేమతో కాదు..గ్రానైట్ మీద ప్రేమతో.
* లెక్కలు తేల్చుకోవడానికి ఇక్కడికి వచ్చి అందరికీ మద్యం తాగించి ఆస్తులు దోచుకోవాడనికి వస్తాడు.
* వైసీపీ నేతలకు ప్రజలకు మంచి చేయాలని లేదు.
* వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులుగామారి, ప్రజలను దోచుకున్నారంటే దానికి కారణం జగన్.
* సాక్షి విలేకరి ఎచ్చర్లలో ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పీఏ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
* మన కుప్పం నియోజకవర్గంలో 500మందిపై అక్రమ కేసులు పెట్టారు..
* ఏంటీ దౌర్బాగ్యం.? వైసీపీ వాళ్లను నేను సీఎం అయ్యాక వదిలిపెడతానా.?
* ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు? ఈ రాష్ట్రంలో బతికే హక్కు లేదా..ఏంటీ ఈ నియంత పోకడలు.?
* 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను..ఎంతో మంది సీఎంలను చూశానుకానీ..ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు.