వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పార్టీ దాడుల్లో గాయపడిన ప్రతి కార్యకర్త కుటుంబాన్నీ ఆయన కలుసుకొని భరోసా ఇవ్వనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నేడు జరిగింది. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై జగన్ దిశా నిర్దేశం చేశారు.
పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు:
- రాబోయే రోజుల్లో కార్యకర్తలను కలుస్తాను
- అధికార పార్టీ దాడుల్లో నష్టపోయిన ప్రతి కార్యకర్తనూ కలిసి భరోసా ఇస్తా
- ఐదేళ్ళు మనం తలెత్తుకునే విధంగా పాలన చేశాం
- మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం
- విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు చేశాం
- వ్యవసాయరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం
- కోవిడ్ సమస్యలున్నా సాకులు చూపకుండా మంచి చేశాం
- డిబిటి ద్వారా 2.7౦ లక్షల కోట్లు ప్రజలకు అందించాం
- ఇంత మంచి చేసినా ఫలితాలు చూసి బాధ కలిగింది
- నాడు శకుని విసిరిన పాచికల కథ గుర్తొచ్చింది, ఆ పాచికల మాదిరిగానే ఫలితాలు వచ్చాయి
- కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేము
- మనకు 40 శాతం సీట్లు వచ్చాయి. గతంలో కంటే 10 శాతం ఓట్లు తగ్గాయి
- బాబు మోసాలను ప్రజలు అతి త్వరలోనే గుర్తిస్తారు
- మనకు తగిన సంఖ్యా బలం లేదు కాబట్టి అసెంబ్లీలో మన పాత్ర నామమాత్రమే
- స్పీకర్ కాబోయే వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో చూస్తున్నాం
- శిశుపాలుడి పాపాలు పండినట్లుగా ఇప్పటికే బాబు మోసాలు మొదలయ్యాయి
- కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నట్లు చెబుతున్నారు, కానీ ప్రత్యేక హోదా దిశగా ప్రయత్నించక పోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి
- మనల్ని నమ్ముకొని కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి