Friday, September 20, 2024
HomeTrending Newsఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి: వైఎస్ జగన్

ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి: వైఎస్ జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజ్ భవన్ కు రాజీనామా లేఖను పంపారు. నేడు వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్ ఈ ఫలితాలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని నిర్వేదం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మందికి తమ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని.. ఎన్నో మంచి పనులు చేసినా ప్రజల ఆప్యాయత ఏమైందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు చూశానని… ప్రజల తీర్పును శిరసా వహిస్తూ ఎక్కడ కింద పడ్డామో అక్కడి నుంచే పైకి లేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి
  • ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రపడ్డాం
  • కోటి ఐదు లక్షల మంది అక్కచెల్లెళ్లకు మేలు చేశాం అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదు.
  • ఆసరా, చేయూత, సున్నా వడ్డీ అందుకున్న అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు
  • ఎన్ని మంచి పనులు చేసిన ఆప్యాయత ఏమైందో తెలియడం లేదు.
  • 54 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సాయం అందించాం. సమయానికి వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ మొదలుకాగానే అందించాం.
  • రైతన్నల ప్రేమ ఏమైందో తెలియడం లేదు.
  • విద్యా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చాం తల్లుల పిల్లల అభిమానం ఏమైందో తెలియడం లేదు.
  • మేనిఫెస్టో బైబిల్ గా ఖురాన్ గా భగవద్గీతగా మొట్టమొదటి రోజు నుంచి భావిస్తూ 99% వాగ్దానాలు అమలు చేసాం.
  • ఎప్పుడూ చూడని విధంగా సచివాల వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం
  • విద్య వైద్య వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొస్తూ పేదవారికి అండగా నిలిచాము.
  • సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికే చూపించగలిగాం.
  • కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత వారి అభిమానం ఆప్యాయత ఏమైందో తెలియదు
  • ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారు అనవచ్చు… కానీ ఆధారాలు లేవు
  • ఏం జరిగిందో దేవుడికి తెలుసు. చేయగలిగింది ఏమీ లేదు ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నా
  • మంచి చేయటానికి ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటా
  • ఓడిపోయినా కూడ ప్రతి కార్యకర్తకు, నాయకులకు, వాలంటీర్లకు, ప్రతి స్టార్ క్యాంపెనర్ కు అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు కృతజ్ఞతలు
  • గుండె ధైర్యంతో ఎక్కడ కింద పడ్డామో అక్కడి నుంచే మళ్లీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయటం అంతకన్నా కొత్త కాదు
  • రాజకీయ జీవితమంతా ఐదు సంవత్సరాల తప్ప ప్రతిపక్షంలోనే గడిపా
  • రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు చూశా
  • నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు
RELATED ARTICLES

Most Popular

న్యూస్