Saturday, January 18, 2025
HomeTrending Newsఈవీఎం బదులు బ్యాలెట్ పేపర్ వాడాలి: జగన్ డిమాండ్

ఈవీఎం బదులు బ్యాలెట్ పేపర్ వాడాలి: జగన్ డిమాండ్

నిజమైన ప్రజాస్వామ్యం స్పూర్తి కొనసాగాలంటే ఈవీఎం బదులు బ్యాలెట్ పేపర్ వినియోగించాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు  ఎన్నికల్లో బ్యాలెట్‌నే వాడుతున్నాయని గుర్తు చేస్తూ మన దేశంలో కూడా అదే దిశగా పయనించాలని కోరారు.

న్యాయం జరగడం  ముఖ్యం కాదని, జరిగిందని తెలియడం ముఖ్యమని…. అదే రీతిలో బలమైన  ప్రజాస్వామ్యమని చెప్పుకోవడమే కాదని… అది నిక్కచ్చిగా అమలు జరిగేట్లు చూడాల్సి ఉందని  అభిప్రాయపడ్డారు.  ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా ఆ దిశగా ఆలోచించాలని ట్వీట్ లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్