Sunday, January 19, 2025
HomeTrending Newsకొంతమందిది రహస్య అజెండా: ఆదిమూలపు

కొంతమందిది రహస్య అజెండా: ఆదిమూలపు

వైఎస్సార్సీపీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని రాష్ట్ర ప్రజలు ఆదరించారని అందుకే గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం అప్పగించారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జన హృదయ నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని, రెండుసార్లు ఆ పార్టీని అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారని కానీ ఆయన చనిపోయిన తరువాత అవినీతి కేసులు పెట్టి,  ఎఫ్ఐఆర్ లో వైఎస్ పేరు కూడా చేర్చారని… అలాంటి పార్టీలో చేరి ఓ రహస్య అజెండాతో కొంతమంది రాజకీయం చేస్తున్నారంటూ వైఎస్ షర్మిలపై పరోక్షంగా విమర్శలు చేశారు. నిన్న ఉత్తరంద్ర్హ పర్యటనలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై మంత్రి సురేష్ స్పందించారు.

వైఎస్ జగన్ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, కానీ  ఆయనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి, రాష్ట్రాన్ని స్వార్ధ ప్రయోజనాలతో విడదీసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్