Sunday, January 19, 2025
HomeTrending Newsప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి - వైఎస్ షర్మిల

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి – వైఎస్ షర్మిల

విద్యార్థులకు కలుషిత ఆహారం పెట్టి, మరో చావుకు సిఎం కెసిఆర్ కారణమయ్యాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బాసర IIIT విద్యార్ధి జీర్ణకోశ వ్యాధితో చనిపోయాడన్నారు. బాసర IIIT లో విద్యార్థి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఅర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల… హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ  సరైన తిండి పెట్టండి అని విద్యార్థులు దీక్షలు చేసినా పట్టింపు లేదని విమర్శించారు. సర్కార్ సరే అని సరిపెట్టింది తప్ప సరైన భోజనం పెట్టలేదని, మాట ఇచ్చిన నెలలోపే కలుషిత ఆహారానికి వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తిండి తింటే చస్తామని మొత్తుకున్నా మొద్దు నిద్రపోతున్న సర్కార్ ఒక విద్యార్థిని బలితీసుకొందని మండిపడ్డారు. ఇంకెంతమందిని బలితీసుకుంటారు దొరా ? అని ప్రశ్నించారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం కండ్లు తెరుస్తుందా? అన్న వైఎస్ షర్మిల చదువుకొనే పిల్లలకు సరైన తిండిపెట్టని సర్కార్ ఉంటే ఎంత? ఊడితే ఎంత? అన్నారు.

Also Read : ఫుడ్ పాయిజన్ పై ఉన్నత స్థాయి విచారణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్